ETV Bharat / state

'తాగుబోతు భర్తకు నడి వీధిలో తకిట తధిమి' - మెదక్ తాజా వార్తలు

భార్య దేన్నయినా భరిస్తుంది అనుకోవడం పొరపాటు. ఏదైనా ఓపిక పట్టిన్నంత కాలమే. తాగొచ్చి వేధిస్తున్న భర్తలో మార్పు వస్తుందేమోనని ఎదురుచూసింది. కానీ ఫలితం లేదని భావించిన ఆ ఇల్లాలు.. బజార్​లోకి లాక్కొచ్చి కట్టేసి చితకబాదింది.

wife beated drunked husband in imampur village circle medak district
తాగి వేధిస్తున్న భర్తకు నడిరోడ్డుపై దేహశుద్ధి
author img

By

Published : Dec 29, 2020, 6:59 AM IST

Updated : Dec 29, 2020, 11:21 AM IST

తాగి వేధిస్తున్న భర్తకు నడిరోడ్డుపై దేహశుద్ధి

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఇమాంపూర్‌ గ్రామానికి చెందిన యాదగిరికి, అదే గ్రామానికి చెందిన కనకవ్వతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా యాదగిరి రోజూ తాగి ఇంటికొస్తున్నాడు. మద్యం మత్తులో భార్యాపిల్లల్ని తిడుతూ, కొడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.

ఈ విషయమై పలుమార్లు పంచాయితీలు జరిగాయి. పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా అతడిలో మార్పు రాలేదు. విసుగుచెందిన కనకవ్వ సోమవారం భర్తను గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చింది. అక్కడ జెండా కర్రకు కట్టేసి కొట్టింది. గ్రామస్థులు ఆమెకు సర్దిచెప్పి, కట్లువిప్పడంతో అతను బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పరుగెత్తాడు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్​ను కలిసిన మహిళా కమిషన్ ఛైర్​ పర్సన్

Last Updated : Dec 29, 2020, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.