నర్సాపూర్ పట్టణంలో వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే ఫిర్యాదుతో .. రాష్ట్ర వక్ప్‌బోర్డు ఓఎస్డీ మహ్మద్ కాశీంతో పాటు ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఖదీర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నర్సాపూర్‌లో నలభై మూడు ఎకరాల పది గుంటల వక్ప్ బోర్డు ఆస్తులు ఉండగా.. అందులో సగం భూములు అన్యాక్రాంతమైనట్టు గుర్తించారు. రెవెన్యూ శాఖతో కలిసి జాయింట్ సర్వే చేశాక ఈ భూములను కబ్జా చేసిన వారికి నోటీసులు ఇస్తామని ఓఎస్డీ మహ్మద్ తెలిపారు.
ఒకరిపై ఒకరు ఆరోపణలు
వక్ఫ్ బోర్డు అధికారుల ముందే స్థానిక ముస్లిం మైనార్టీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నయిమ్ తోపాటు ఏఎంసీ వైస్ ఛైర్మన్ హబీబ్ ఖాన్, ఎంఐఎం నాయకులు రియాజ్ గులాం మహమ్మద్‌తో పాటు పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.