ETV Bharat / state

'సంతోష్‌, పద్మలది ఆత్మహత్య కాదు.... తెరాస ప్రభుత్వ హత్యలు' - తెలంగాణ భాజపా తాజా వార్తలు

కామారెడ్డిలో చనిపోయిన సంతోష్‌, పద్మలది ఆత్మహత్య కాదని తెరాస ప్రభుత్వ హత్యలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. రామాయంపేటలో బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ వివేక్​తో కలిసి వారిని పరామర్శించారు.

Visit by Santosh family members
సంతోష్ కుటుంబ సభ్యుల పరామర్శ
author img

By

Published : Apr 19, 2022, 6:06 PM IST

Updated : Apr 19, 2022, 6:30 PM IST

సంతోష్‌, పద్మలది ఆత్మహత్య కాదని తెరాస ప్రభుత్వ హత్యలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. రామాయంపేటలో బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ వివేక్​తో కలిసి వారిని పరామర్శించారు. చట్టాన్ని కాపాడని, ప్రజలకు రక్షణ కల్పించలేని సీఎం, డీజీపీలకు కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు.

చట్టానికి లోబడి పని చేయాల్సిన డీజీపీ సీఎం కేసీఆర్​కు గులాం గిరి చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. సీపీలు, ఎస్పీలు, డీఎస్పీలది అదే తీరన్నారు. గంజాయి, హెరాయిన్ అమ్మకాలు, అమ్మాయిల వేధింపుల మీద దృష్టి పెట్టాల్సిన ఇంటెలిజెన్స్ అధికారులు.. వివిధ రాజకీయ పార్టీ, నాయకులు కార్యకర్తల మీద నిఘా పెడుతున్నారని ఆరోపించారు. తెరాసలో చేరేందుకు అంగీకరించని ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి వారిని ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆయన అన్నారు.

"సీఎం తెలంగాణ గాంధీ కాదు... తెలంగాణ ద్రోహి. మంత్రి హరీశ్ రావు హుజురాబాద్ ఎన్నికల్లో అక్రమంగా ఖర్చు పెట్టిన రూ.600 కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. అదంతా ప్రజల సొమ్మే. హుజూరాబాద్​లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ప్రభుత్వానికి బుద్ది రాలేదు. అక్కడ వచ్చిన ఫలితమే రాష్ట్ర వ్యాప్తంగా రాబోతోంది. తెరాసను తరిమి కొట్టే రోజు త్వరలో వస్తుంది. అప్పుడు పోలీసులు మిమ్మల్ని రక్షించలేరు. రామాయంపేట కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి."

-ఈటల రాజేందర్ భాజపా ఎమ్మెల్యే

సంతోష్, పద్మ ఆత్మహత్య కేసులో తెరాస నేతలు ముద్దాయిలని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు కారణమైన వారిని పట్టుకోవటంలో ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని ప్రశ్నించారు. నిందితులు ఫోన్ లో మాట్లాడుతూన్నారు. సీసీ కెమెరాలో వారు ఎక్కడికి వెళ్ళారు అనేది తెలిసే అవకాశం ఉన్నా .. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే దాకా తాము అండగా ఉంటామని తెలిపారు. పోలీసులు న్యాయం చేయక పోతే హైకోర్టు లేదా, సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. నిందితులను అరెస్ట్ చేయక పోవడంతో పోలీసులపై విశ్వాసం పోయిందని ఆయన పేర్కొన్నారు.

తెరాస నాయకులకు కమీషన్ ఇవ్వాల్సిందేనని లేకపోతే ప్రజలను నానా అవస్థలు పెడుతున్నారని మజీ ఎంపీ వివేక్ ఆరోపించారు. డబ్బులు తీసుకొని పోలీసులకు పోస్టింగ్ ఇస్తున్నారన్నారు. తెరాస నాయకుల అక్రమాలను పోలీసులు ప్రోత్సహిస్తున్నారు. ప్రజా స్వామ్య విరుద్ధంగా పోలీసులు, రాజకీయ నాయకులు కలిసి పని చేస్తున్నారని విమర్శించారు. మృతుడు సంతోష్ ఎస్పీ, డీజీపీలకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారు. అతని మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి నాలుగు రోజులైనా నిందితులను అరెస్ట్ చేయడం లేదంటే ప్రభుత్వ హస్తం ఉందని అర్థం అవుతోందని ఆయన పేర్కొన్నారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు రామాయంపేట బంద్​కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా వ్యాపార దుకాణ సముదాయాలు మూసివేశారు. తూప్రాన్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.

ఇదీ చదవండి: సాయిగణేశ్​ కుటుంబాన్ని ఫోన్​లో పరామర్శించిన కేంద్రమంత్రి అమిత్​షా..

'పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రగామి'

Last Updated : Apr 19, 2022, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.