అక్రమ సంబంధం కారణంగా ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. ఈ హత్యకు కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 3న కౌడిపల్లికి చెందిన పూసల మహేశ్‌ను అదే గ్రామానికి చెందిన పండ్ల వెంకటేష్, నవీన్‌లు ఇద్దరు కలిసి నర్సాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చంపారు. అనంతరం పెట్రోలు పోసి గుర్తు పట్టకుండా తగలబెట్టారు. వెంకటేష్ భార్యతో మహేశ్ అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలో ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న వెంకటేష్, నవీన్ సహకారంతో నర్సాపూర్ అడవిలోకి తీసుకొచ్చి చంపి పెట్రోలు పోసి తగలబెట్టాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: పోలీస్ స్టేషన్ ముందు సర్పంచ్ ఆత్మహత్యాయత్నం