13 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమని సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. జిల్లా కేంద్రంలోని గుల్షన్ క్లబ్ వద్ద కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఏబీవీపీ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సామూహిక దీక్ష చేపట్టారు. సాయిబాబా కళాబృందంతో ధూంధాం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : తాకట్టులో ఆర్టీసీ ఆస్తులు... అప్పులు రూ.2445 కోట్లు!