మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో మోడల్ స్కూల్ ఉంది. జక్కపల్లి గ్రామం నుంచి ఆ పాఠశాలకు వెళ్లేందుకు రోజు ఉదయం రెండు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక్క బస్సే వస్తోంది. ఒక్కోసారి అది కూడా ఉండట్లేదు. దీనివల్ల విద్యార్థులు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం అంటేనే చిన్నారుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. తమ సమస్యను త్వరగా పరిశీలించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.
- ఇదీ చూడండి : చంద్రబాబుకు అవమానం.. సిబ్బంది తీరు వివాదాస్పదం...