మెదక్ జిల్లా కేంద్రంలోని వెలుగు సమాఖ్య భవనంలో 'ఆరోగ్యం- పోషణ'పై ఏపీఎం, సీసీలు, వీఓలకు రెండు రోజుల శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి హాజరయ్యారు.
ఆరోగ్యం- మహాభాగ్యం, ఆహారంలో ఆరోగ్యం, పోషకాలు నష్టపోకుండా వండే విధానం వంటి అంశాలపై రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. పేదలు మెరుగైన, ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఇవీ చూడండి: మూసీతో బతుకు మసిపై... కదిలిన హైకోర్టు