మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్లో భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన నత్తి యాదగిరికి ఆండాల్ అనే మహిళతో వివాహం జరిగింది. ఆమెకు సంతానం కలగలేదు. యాదగిరి మంజుల అనే మరో మహిళతో రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. మంజుల ఆడపిల్లకు జన్మనిచ్చింది. అంతా బానే ఉన్నా.. మంజుల అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వారం క్రితం ఏటో వెళ్లిపోయింది. ఈ విషయం పోలీస్స్టేషన్ వరకు వెళ్లింది. అవమాన భారం భరించలేని యాదగిరి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పపడ్డాడు.
ఇవీ చూడండి.. టీ20లో డుమిని విశ్వరూపం... యువీ రికార్డు పదిలం