Supreme court senior advocates: తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు సహా... 25 మందికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హోదాను కల్పించింది. న్యాయవాదుల కోటాలో తెలంగాణ నుంచి పి.నిరూప్కు సీనియర్ హోదా లభించింది. మెదక్ జిల్లాకు చెందిన పి.నిరూప్ 30 ఏళ్లుగా సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఉన్నారు. ఆయన సీనియర్ న్యాయవాది, మాజీ స్పీకర్ పి.రామచంద్రారెడ్డి కుమారుడు.
P. nirup as a SC senior advocate: విశ్రాంత న్యాయమూర్తుల కోటాలో జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి, జస్టిస్ నౌషద్ అలీకి.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హోదా కల్పించింది. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా, బిహార్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. జస్టిస్ నౌషద్ అలీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ హైకోర్టులో న్యాయమూర్తిగా చేశారు. 18 మంది న్యాయమూర్తులతో పాటు.. ఏడుగురు విశ్రాంత న్యాయమూర్తులకు సీనియర్ న్యాయవాది హోదా కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి: Dharmapuri Arvind: తెరాస ఎమ్మెల్యేలు బియ్యం రీసైక్లింగ్ దందాలో ఉన్నారు: ఎంపీ అర్వింద్