మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముందు జిల్లా పాలనాధికారితో సహా ఖాళీగా ఉన్న జిల్లా స్థాయి అధికారుల పోస్టులు భర్తీ చేయాలని సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు.
ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులు లేకపోవడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. మెదక్ జిల్లా పాలనాధికారి జూలై 31న పదవీ విరమణ పొందిన అనంతరం అదనపు కలెక్టర్ నగేష్ అవినీతి కేసులో సస్పెండ్ అయ్యారని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా జిల్లా పంచాయతీ అధికారి సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. ప్రజలకు నిత్యావసరంగా ఉపయోగపడే వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, కోపరేటివ్ శాఖ, సివిల్ సప్లై కార్మికశాఖ ....
లాంటి ముఖ్యమైన అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చారించారు.
ఇదీ చూడండి: హేమంత్ హత్య కేసు నిందితులకు పోలీసు కస్టడీ