ETV Bharat / state

'సమస్యల పరిష్కారంపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది' - మెదక్​ జిల్లా తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని... పీఆర్​టీయూ తెలంగాణ శాఖ మెదక్​ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి అన్నారు. దానికి నిరసనగా జిల్లా కేంద్రంలోని స్థానిక జీకేఆర్ గార్డెన్ నుంచి కలెక్టరేట్​ వరకు సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

teachers rally to the Collectorate under the auspices of  PRTU in medak district
సమస్యల పరిష్కారంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
author img

By

Published : Feb 9, 2021, 4:32 PM IST

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి దాదాపు 8 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు కల్పించడం లేదని... పీఆర్టీయూ మెదక్​ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి అన్నారు. తమ సమస్యల పరిష్కారంపై రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. దానికి నిరసనగా జిల్లా కేంద్రంలోని జీకేఆర్ గార్డెన్ నుంచి కలెక్టరేట్​ వరకు సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

సీపీఎస్​ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పదోన్నతులు, బదిలీలు కల్పించాలని అన్నారు. పీఆర్​సీ ఫిట్​మెంట్​ను 45శాతం ప్రకటించి, వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్​ను ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే విడుదల చేసి నిర్వహించాలని కోరారు.

ఇదీ చదవండి: 'చేతులు ఎత్తడం ద్వారానే మేయర్ ఎన్నిక'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.