ETV Bharat / state

'కరోనా జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించాలి'

author img

By

Published : Jun 13, 2021, 5:24 AM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్​ నియోజకవర్గంలో రాష్ట్ర మహిళా కమీషన్​ ఛైర్మన్​ సునీతా లక్ష్మారెడ్డి పర్యటించారు. నర్సాపూర్​ ప్రాంతీయ ఆసుపత్రి, రెడ్డిపల్లి, శివ్వంపేట పీహెచ్​సీలకు ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు అందజేశారు.

'కరోనా జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించాలి'
'కరోనా జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించాలి'

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమీషన్‌ ఛైర్మన్​ సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. మెదక్​ జిల్లా నర్సాపూర్‌ ప్రాంతీయ ఆసుపత్రికి 10 లీటర్ల సామర్థ్యం గల 2 ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు, రెడ్డిపల్లి పీహెచ్‌సీ, శివ్వంపేట పీహెచ్‌సీలకు ఒక్కోటి చొప్పున అందించారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు వాటికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సునీతా లక్ష్మారెడ్డి సూచించారు. స్వీయ రక్షణతోనే వైరస్​ వ్యాప్తిని అడ్డుకోగలమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శివ్వంపేట, నర్సాపూర్‌ మండలాల్లో కరోనా వ్యాధితో మృతి చెందిన బాధిత కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు.

ఇదీ చూడండి: హరిత భవనంగా నిలువనున్న సచివాలయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.