ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని మెదక్ పట్టణ శివారులో పసుపులేరు ఒడ్డునగల శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారు భక్తులకు ఫలంబరిగా దర్శనమిచ్చారు. ఆలయ పూజారులు వేదవ్యాస శ్రీనివాస శర్మ వివిధ రకాల పండ్లతో అమ్మవారిని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కొండన్ సురేందర్ గౌడ్ బాధ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండీ: మొక్కవోని సంకల్పం... తల వంచిన వైకల్యం