ఆరో విడత హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్... మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఈనెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆరోవిడత హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ దఫాలో 30 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్... మొక్క నాటి ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలోని అన్ని జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరం కొనసాగాలని సీఎం స్పష్టం చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట... ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున నర్సరీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్