ETV Bharat / state

YS Sharmila: రాష్ట్రం వచ్చి ఏడేళ్లు గడిచినా నిరుద్యోగులకు చావే దిక్కు! - ys sharmila visiting in cheryala village

దేశంలో ఉన్న నిరుద్యోగుల్లో అధిక శాతం తెలంగాణలోనే ఉన్నారని వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ లక్ష్యాలతో ఉద్యమ చేసి రాష్ట్రం సాధించుకున్నామో.. ప్రస్తుత పరిస్థితులు వాటికి భిన్నంగా ఉన్నాయన్నారు. అమరుల త్యాగాలను ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని సూచించారు. మెదక్‌ జిల్లా చేర్యాలలో ఉద్యోగం లేక ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.

ys sharmila comments on trs ruling
తెరాస పాలనపై వైఎస్‌ షర్మిల కామెంట్స్‌
author img

By

Published : Jun 2, 2021, 12:11 PM IST

Updated : Jun 2, 2021, 1:02 PM IST

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో... ఏడెళ్లవుతున్నా యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్‌ షర్మిల అన్నారు. కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల నుదుటిపై పాలకులు మరణశాసనం రాస్తున్నారని మండిపడ్డారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం చేర్యాలలో ఉద్యోగం రావడం లేదని ఆత్మహత్య చేసుకున్న కొట్టంల వెంకటేష్ కుటుంబసభ్యులను షర్మిల పరామర్శించారు.

ఉద్యమం అయిపోలేదు

ఏ లక్ష్యాలతో ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామో... ప్రస్తుత స్థితిగతులు వాటికి దరిదాపుల్లో కూడా లేవని షర్మిల విమర్శించారు. ఇంకెంత మంది యువత, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారని షర్మిల నిలదీశారు. దేశంలో ఉన్న నిరుద్యోగుల్లో అధికశాతం తెలంగాణలోనే ఉన్నారని వ్యాఖ్యానించిన షర్మిల.. అమరుల త్యాగాలను ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. ఉద్యమం ఇంకా ఉంది.. లక్ష్యాలను పోరాడి సాధించుకోవాలని స్పష్టం చేశారు.

ఆయుష్మాన్‌ భారత్‌ను మొదట్లో విమర్శించిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు అందులో చేరడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు.

ఇంకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం స్పందిస్తుంది: వైఎస్‌ షర్మిల

ఇదీ చదవండి: భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

Last Updated : Jun 2, 2021, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.