బంజారా సోదరులకు పరిపాలన శక్తి రావాలనే తండాలను గ్రామ పంచాయతీలుగా కేసీఆర్ చేయడం జరిగిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధనలో లంబాడీలు ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు. మెదక్ పట్టణంలో వాళ్లు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఎస్టీ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వాలు సంత్ శ్రీ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించలేదని విమర్శించారు. మెదక్ పట్టణంలో ఆర్డీఓ సాయిరామ్ ఆధ్వర్యంలో సేవాలాల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. వ్యాపారాలు చేసుకునే వారికి ఎస్టీ కార్పొరేషన్ ద్వారా అవకాశం కల్పిస్తామన్నారు.
సొంత స్థలాలున్న వారికి మార్చి తర్వాత ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, నాయకులు లింగారెడ్డి, అశోక్, లంబాడి సోదరీ, సోదరమణులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో టైలరింగ్ సెంటర్ ప్రారంభం