గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ 281వ జయంతిని మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డిలు పాల్గొన్నారు.
జయంతి సందర్భంగా పట్టణంలోని చౌరస్తా నుంచి సేవాలాల్ ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం బోగ్‌భండార్ నిర్వహించారు. అంతకముందు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి: కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా