ETV Bharat / state

ప్లాస్టిక్ వాడితే జరిమానా తప్పదు: అటవీ అధికారి - నర్సాపుర్​ పార్కులో ప్లాస్టిక్​ ఫ్రీ డ్రైవ్​

భూమిలో ప్లాస్టిక్​ కరిగిపోవడానికి సుమారు వందేళ్లు పడుతుందని సంగారెడ్డి జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. నర్సాపూర్ - హైదరాబాద్ రహదారిపై ఆయన ప్లాస్టిక్​ ఫీ డ్రైవ్​ను నిర్వహించారు. నర్సాపూర్​ పార్క్ పరిసరాల్లో ప్లాస్టిక్​ వాడితే జరిమాన విధిస్తామని పర్యటకులను హెచ్చరించారు.

sangareddy forest officer ban plastic in narsapur park area
ఆ పార్కు పరిధిలో ప్లాస్టిక్​ వాడకం నిషేధం
author img

By

Published : Jan 10, 2021, 7:56 PM IST

మెదక్​ జిల్లాలోని నర్సాపూర్​ అర్బన్​ పార్క్​ను ప్లాస్టిక్​ ఫ్రీ జోన్​గా ప్రకటించినందును పర్యటకులెవరూ ప్లాస్టిక్​ వస్తువులను తీసుకురావొద్దని జిల్లా అటవీ అధికారి వి. వెంకటేశ్వర్లు కోరారు. ఈ సందర్భంగా నర్సాపూర్ - హైదరాబాద్ రహదారిపై ప్లాస్టిక్​ ఫీ డ్రైవ్​ను నిర్వహించారు.

భూమిలో ప్లాస్టిక్​ కరిగిపోవడానికి సుమారు వందేళ్లు పడుతుందని అటవీ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. దాని వల్ల అటవీ జంతువులకుకూడా అనేక రోగాలు సంభవిస్తాయని అన్నారు. పార్క్ పరిసరాల్లో ప్లాస్టిక్​ వాడితే జరిమాన విధిస్తామని హెచ్చరించారు. దశల వారీగా అన్ని అటవీ ప్రాంతాల్లో, అర్బన్ పార్కుల్లో స్పెషల్ డ్రైవ్​లు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్‌ అటవీ రేంజ్​ అధికారులు అంబర్‌సింగ్‌, బాలేశం పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'వచ్చేది భాజపా ప్రభుత్వమే... అందరి గుట్టు రట్టు చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.