ETV Bharat / state

'ఉపాధి పనుల రికార్డులతో తనిఖీలకు సిద్ధంగా ఉండండి' - రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ

ఉపాధిహామీ పథకం కింద.. డిమాండ్ మేరకు కూలీలకు పనిదినాలను కల్పించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్​ అధికారులకు సూచించారు. మెదక్​ జిల్లాలో పర్యటించి నరేగా పనుల తీరును పరిశీలించారు.

Rural Development Department, said officers should keep records of narega activities for inspections
'ఉపాధి పనుల రికార్డులతో తనిఖీలకు సిద్ధంగా ఉండండి'
author img

By

Published : Dec 24, 2020, 3:04 PM IST

అధికారులు ఉపాధి పనులకు సంబంధించిన రికార్డులన్ని భద్రపరుస్తూ.. ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్​ సైదులు పేర్కొన్నారు. మెదక్​ జిల్లాలో పర్యటించి నరేగా పనుల తీరును పరిశీలించారు. కలెక్టరేట్​లో ఎంపీడీఓలు, ఎపీఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని.. అధికారులనుద్దేశించి మాట్లాడారు.

గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేసిన పనులకు సంబంధించి.. రిజిస్టర్లు, వర్క్​ఫైళ్ళు, సైట్​బోర్డులు, ఫొటోలు, రికార్డులు, ఇతర ప్రతులన్ని భద్రపరచాలని సైదులు అధికారులకు సూచించారు. ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలకు సిద్ధంగా ఉండాలన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం కూలీలకు పనిదినాలు కల్పించడంలో మెదక్​.. రాష్ట్రంలో నాల్గవ స్థానంలో నిలిచిందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నరేష్, కమిషనర్​కు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో ఎప్పటికప్పుడు తీర్మానాలు చేస్తూ.. పూర్తిచేసిన పనులకు రికార్డులు రాస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ ముఖ్య కార్య నిర్వాహణధికారి లక్ష్మిబాయి, పలువురు ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్​లు, పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఉపాధి హామీకి కేంద్రం అవార్డులే తప్ప నిధులు లేవు: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.