ETV Bharat / state

Road Accident at Kolcharam : మెదక్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాలు.. నలుగురు మృతి.. - raju road accident case

Road Accident at Kolcharam : ఓ కుటుంబం కారులో బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా .. ఆర్​టీసీ బస్సుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఘటనలో ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందాడు. మరో వ్యక్తి ప్రమాదవశాత్తు డీసీఎం కిందపడి మృతి చెందాడు. ఈ ఘటనలు మెదక్​ జిల్లాలో జరిగాయి.

Road Accident at Kolcharam
Road Accident at Kolcharam
author img

By

Published : May 26, 2023, 9:54 PM IST

Updated : May 26, 2023, 10:12 PM IST

Road Accident at Kolcharam : ఒకే జిల్లాలోని వేరు వేరు ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. పెళ్లిలో ఆనందంగా గడిపి.. తిరిగి ఇంటికి వెళ్తున్న ఓ కుటుంబానికి విషాదం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న కారు, ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వేరే చోట ట్రాక్టర్​ని డ్రైవ్​ చేసుకుంటు వెళ్తున్న వ్యక్తి ఆ ట్రాక్టర్​ కింద పడి మరణించాడు. మరో చోట ఇంకో వ్యక్తి డీసీఎం టైర్​ కింద పడి మృతి చెందాడు. ఈ ప్రమాదాలన్ని మెదక్​ జిల్లాలో జరిగాయి.

బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : మెదక్​ జిల్లాలోని పాపన్నపేట మండలం ఎల్లాపూర్​ గ్రామానికి చెందిన నాగరాజు(32), అతని కుటుంబంతో సహా హత్నూ మండలం దోల్తాబాద్​లో బంధువుల విహహానికి వెళ్లారు. పెళ్లి అనంతరం కారులో తిరిగి వస్తున్న క్రమంలో.. కొల్చారం మండలంలోని జైన మందిర్ వద్ద హైదరాబాద్​కి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ కారును డ్రైవ్​ చేస్తున్న నాగరాజు, తన అన్న కుమార్తె హర్షిత(9 నెలలు) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు అన్న దుర్గగౌడ్​, అతని భార్య లావణ్య పరిస్థితి విషమంగా ఉంది. కుమారుడు చోటు, రామమ్మకు గాయాలు అయ్యాయి. రోడ్డు ప్రమాదం విషయం స్థానికులు ద్వారా తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని హైదరాబాద్​లోని ఓ ప్రవేట్​ ఆసుపత్రికి తరలించారు. మృత దేహాలను మెదక్​ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు స్థానిక సీఐ విజయ్ తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్​ పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

Young Man Died After the Tractor Overturned at KalvaKunta : మెదక్​ జిల్లాలోనే మరో హృదయవిదారకర ఘటన జరిగింది. ట్రాక్టర్​ బోల్తాపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన నిజంపేట మండలంలోని కల్వకుంట గ్రామ శివారులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా భూపల్లి మండలంలోని ఖాజీపూర్​ గ్రామానికి చెందిన ఆసా రాజు(28) కల్వకుంట గ్రామం నుంచి ఖాజీపూర్​కి ట్రాక్టర్​ మీద వెళ్తున్నాడు. మార్గమధ్యమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్​ బోల్తాపడింది. దీంతో ఆ ట్రాక్టర్​ కిందపడి ఆ యువకుడు మృతి చెందాడు.

Man Died After Falling Down on the DCM : అదే జిల్లాలో కౌడిపల్లి మండలంలో మరో వ్యక్తి డీసీఎం టైర్​ కిందపడి మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. అందోల్​ మండలం రామసాంపల్లి గ్రామానికి చెందిన సాధుల శ్రీకాంత్​(35).. కౌడిపల్లి మండలం మనం తయపల్లి తండా వద్ద ప్రమాదవశాత్తు డీసీఎం టైర్​ కింద పడి మృతి చెందాడు.

ఇవీ చదవండి :

Last Updated : May 26, 2023, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.