మెదక్ జిల్లా పోలీస్ యంత్రాంగం శాంతి భద్రతలను కాపాడుతూ.. ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి పేర్కొన్నారు. ప్రజల రక్షణ కొరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను పాటించాలని కోరారు. లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని హెచ్చరించారు. జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించి హోంక్వారంటైన్లో పెడుతున్నట్లు ఆమె తెలిపారు.