ETV Bharat / state

మెదక్​లో ఆగిన రైలు కూత - పాసింజర్‌ ట్రైన్ రద్దుతో ప్రజల తిప్పలు

Railway Department Cancelled Medak Passenger Train : ప్రజా ప్రతినిధుల సహకారంతో ఎట్టకేలకు గత ఏడాది మెదక్‌లో రైలు కూత వినిపించింది. కానీ ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. మూడు నెలల కిందట ట్రాక్‌ మరమ్మతులు కారణంగా సాయంత్రం నడిచే రైలును తాత్కాలింగా రద్దు చేసిన రైల్వే అధికారులు.. ఇప్పటి వరకూ మళ్లీ పునరుద్దరించలేదు. దీనివల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలు రైల్వే సేవలు పునరుద్ధరించాలని అధికారులను కోరుతున్నారు.

Medak Passenger Train Cancelled
Medak Kacheguda Train Problems
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 18, 2023, 11:20 AM IST

మెదక్​లో ఆగిన రైలు కూత - మూడు నెలల కిందట పాసింజర్‌ రైలును రద్దు చేసిన రైల్యే అధికారులు

Railway Department Cancelled Medak Passenger Train : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు దశాబ్దాల మెదక్‌ ప్రజల ఎదురు చూపులకు తెరదించుతూ 2022 సెప్టెంబర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేతులు మీదగా రైలుకూత ప్రారంభమైంది. కానీ ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. రోజూ సాయంత్రం రావల్సిన పాసింజర్‌ రైలు కూత ఆగి దాదాపు మూడు నెలలవుతోంది. ఫలితంగా ఉద్యోగులు, కూలీలు, సాధారణ ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే సేవలు పునరుద్ధరించాలని అధికారులను వేడుకుంటున్నారు.

సంక్రాంతి సందడి షురూ - నెలన్నర ముందే రైలు టికెట్ల బుకింగ్

Medak Kacheguda Train Problems : మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్‌ రైల్వేస్టేషన్‌ వరకు 17 కిలోమీటర్లు రైల్వేలైన్ నిర్మించగా 2022 సెప్టెంబరు 23న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అప్పట్నుంచి కాచిగూడ-మెదక్ మధ్య నిత్యం రెండు ప్యాసింజరు రైళ్లు నడుస్తుండేవి. గత మూడు నెలల కిందట గుంటూరు జంక్షన్ పరిధిలో ట్రాక్‌ మరమ్మతులు కారణంగా సాయంత్రం నడిచే రైలును తాత్కాలింగా రద్దు చేసిన రైల్వే అధికారులు.. ఇప్పటి వరకూ మళ్లీ పునరుద్దరించలేదు.

సికింద్రాబాద్-సిర్పూర్‌ కాగజ్‌నగర్ రైలులో పొగలు - పరుగులు తీసిన ప్రయాణికులు

"దశాబ్దాల కల నెలవేరిందనుకొనేలోపే ఏడాది తిరగక ముందే రైలు ఆపివేయడం వల్ల రైలు వచ్చిందన్న ఆనందం కొన్నాళ్లే ఉండిపోయింది. మెదక్-కాచి గూడ రైలు రద్దు కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. స్కూళ్లు, ఉద్యోగాలకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. గత మూడు నెలలుగా రైల్వే అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదు. రైల్వే సేవలను వీలైనంత తొందరగా పునరుద్ధరించాలని కోరుతున్నాము." - స్థానికులు

Passenger Train from Medak to Kachiguda : మెదక్ రైలు కావాలన్న దశాబ్దాల కలను సాకారం చేసుకోవడానికి రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో దశాబ్దాలుగా ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. ప్రజా ప్రతినిధుల సహకారంతో ఎట్టకేలకు గత ఏడాది మెదక్‌లో రైలు కూత వినిపించింది. దాన్ని పూర్తి వినియోగించుకునేలోపే ఇలా రైలు నిలిపేయడం నిరాశకు గురిచేస్తోందని ఉద్యోగులు, చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

''సికింద్రాబాద్ నుంచి గుంటూరు వయా కాచిగూడ డ్రోన్ మీదుగా రైలు నడుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి అనేక రైలు కాచిగూడ, అక్కన్నపేట వరకు వస్తున్నాయి. అలాగే మెదక్ వరకు రైలు నడిపిస్తే మేము చాలా ఆనందిస్తాము. గుంటూరులో డబుల్ ట్రాక్ రైల్వే పనులు జరుగుతున్నాయని రైల్వే అధికారులు మెదక్ వచ్చే పాసింజర్ రైలును నిలిపివేశారు. మూడు నెలలు గడుస్తున్న రైలును పునరద్ధించిండం లేదు. వాణిజ్య పరంగా మెదక్ పట్టణం అభివృద్ది చెందాలంటే గూడ్స్ రైలును కూడా నడపాలని రైల్వే అధికారులను కోరుతున్నాను.'' -స్థానికులు

Hyderabad Metro Service: ఆ స్టేషన్లలో మెట్రో సేవలు నిలిపివేత

గంటల వ్యవధిలోనే రెండు రైలు ప్రమాదాలు- పట్టాలు తప్పిన గూడ్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.