చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల అమలుకు జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఆదివారం మెదక్ జిల్లా బొంరాస్‌పేట మండలం నాందార్‌పూర్‌లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఆయన హాజరయ్యారు.
పార్లమెంట్‌లో బీసీలకు న్యాయం జరిగే విధంగా చట్టసవరణ చేయాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా గొర్రెలు, బర్రెలు, పెన్షన్లు అందిస్తూ శాశ్వత పేదలుగా మారుస్తోందని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలను షరతులు లేకుండా ఇవ్వాలని అన్నారు.