ETV Bharat / state

'సమతుల ఆహారంతో పోషకాహార లోపం మాయం' - నర్సాపూర్​లో పోషన్​ అభియాన్​

మెదక్‌ జిల్లా నర్సాపూర్​ మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మండల స్థాయి పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చేతుల శుభ్రతపై అవగాహన కల్పించారు.

poshan abhiyan program conducted at narsapur in medak district
'సమతుల ఆహారంతో పోషకాహారం లోపం మాయం'
author img

By

Published : Sep 20, 2020, 9:17 AM IST

ప్రతి గ్రామంలోని పోషకాహారలోపం ఉన్న పిల్లల్ని గుర్తించి వారికి సమతుల ఆహారం అందించాలని జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి భీమయ్య తెలిపారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్​ మండల మహిళ సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి పోషణ్ అభియాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి అంగన్​వాడీ కేంద్రంలో పెరటితోట ఏర్పాటు చేసి కూరగాయలు, ఆకుకూరల పెంపకం చేపట్టాలని సూచించారు.

పోషకాహరం తినడం వల్ల అన్ని రకాల వయస్సుల వారికి వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని.. వ్యాధులు ధరిచేరవని చెప్పారు. అన్ని కాలాలలో దొరికే పండ్లతోపాటు కూరగాయాలు తప్పకుండా తినాలన్నారు. చేతుల శుభ్రతకు సంబంధించి ఆరు రకాల చేతులు కడుగు విధానాన్నిగ్రామ సంఘ ప్రతినిధులకు చూపించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ హేమ భార్గవి, సూపర్​వైజర్ అంజమ్మ, వసంత, గౌరీశంకర్, మండల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు శ్రీలత, అనిత, మీన తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: భగ్గుమంటున్న ధరలు.. సామాన్యునికి కూర'గాయాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.