మెదక్ జిల్లా మహిళా అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ ముగింపు కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్లో నిర్వహించిన పోషణ అభియాన్లోని రెండు మఖ్య అంశాల గురించి తెలియజేశారు.
ముఖ్యమైన అంశాల్లో మొదటిది పిల్లల బరువు కాగా.. రెండోది పెరటి తోట పెంపకం గురించి వెల్లడించారు. 2018-19లో నిర్వహించిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరచిన సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ శ్రీనివాస్, సీపీవో శ్రీనివాస్, డీఈవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఏన్కూరులో పోషణ అభియాన్ కార్యక్రమం