మెదక్ జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 37 సహకార సంఘాలుండగా... 5 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 32 సొసైటీలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి.
జిల్లాలో మొత్తం 244 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 268 పీఓలు, 300 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
- ఇవీ చూడండి:గాంధీ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్ అరెస్ట్