ETV Bharat / state

జిల్లాలో 523 బూత్​ల ద్వారా పోలియో చుక్కల పంపిణీ - polio drops vaccination started in medak district centre

మెదక్​ జిల్లాలో ఆదివారం పల్స్​ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని మున్సిపల్​ కార్యాలయ ఆవరణలో వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు.. చిన్నారికి పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.

medak, polio drops
మెదక్​ జిల్లా, పోలియో టీకా
author img

By

Published : Jan 31, 2021, 11:42 AM IST

మెదక్ జిల్లా కేంద్రంలో చిన్నారులకు పల్స్​ పోలియో చుక్కల మందు కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో ఐదు సంవత్సరాల లోపు 75 వేల 590 మంది చిన్నారులను గుర్తించినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. 523 బూత్​ల ద్వారా టీకా వేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో నలుగురు చొప్పున 2250 మంది వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సూపర్​వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలను నియమించినట్లు వెల్లడించారు.

చిన్నారులకు నిర్దేశించిన బూత్​లలో మాత్రమే వ్యాక్సిన్​ వేస్తారని అధికారి చెప్పారు. అనివార్య కారణాల వల్ల ఈ రోజు మిగిలిపోయిన చిన్నారులకు ఈ రెండ్రోజులు ఆరోగ్య కార్యకర్తలు.. ఇంటింటికి వెళ్లి పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేస్తారని వివరించారు. ఇందుకు తల్లిదండ్రులు సహకరించవలసిందిగా వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: త్వరలో అందుబాటులోకి రానున్న కరీంనగర్‌ పార్కు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.