రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారాన్ని ఉద్యమంలా చేపడుతోంది. ఇప్పటి వరకు ఐదు విడతలుగా హరితహారం విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరో విడతలో హరితహారం విజయవంతంగా కొనసాగుతోంది. అందులో భాగంగా మెదక్ జిల్లా కుల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామంలో డ్వాక్రా మహిళ సంఘాల ఆధ్వర్యంలో ఇంటింటికి ఆరు మొక్కలను పంపిణీ చేశారు. కృష్ణ తులసితో పాటు జామ, బొప్పాయి, నిమ్మ, గులాబీ, దానిమ్మ తదితర మొక్కలను ఇంటింటికి అందజేశారు. ముఖ్యంగా మహిళలు తులసికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. కరోనా వైరస్ మహమ్మారిని తట్టుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తులసి ఆకు పని చేస్తుందని వైద్యులు చెప్పడం వల్ల మహిళలు తులసిని ఎక్కువగా తీసుకెళ్లారు.
గతంలో నాలుగు ఐదు గ్రామాలకు ఒకటి చొప్పున నర్సరీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఈసారి నూతనంగా గ్రామ నర్సరీలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వీటిలో ఇండ్లలో పెంచుకునే మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయని ప్రతి ఇంట్లో తులసి మొక్క పెంచాలన్నది ప్రభుత్వం ఉద్దేశం.
ఇవీ చూడండి: చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా?.. అయితే జాగ్రత్త!
డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ - plants distribution
హరితహారం కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలోని నాయిని జలాల్పూర్లో డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామస్థులకు మొక్కలను పంపిణీ చేశారు. ఇంటింటికి ఆరు మొక్కలను ఆందజేశారు. గ్రామస్థులు ఎక్కువగా తులసి మొక్కను పెంచేందుకే మొగ్గుచూపారు.