మెదక్ జిల్లా కలెక్టరేట్ మురికి కూపాన్ని తలపిస్తోంది. ప్రజలకు దిశానిర్దేశం చేయాల్సిన అధికారం యంత్రాంగం పరిశుభ్రతను మరచి చెత్తబుట్టలా మార్చేసింది. మూడంతస్తుల భవనంలో ఉండే పాలనాధికారి కార్యాలయంలో 30 ప్రభుత్వ శాఖలు పని చేస్తున్నాయి. పారిశుద్ధ్యం విషయంలో అడుగడునా నిర్లక్ష్యం కనిపిస్తోంది.
కలెక్టరేట్లో నలువైపులా ఎటు చూసినా చెత్తచెదారమే దర్శనమిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, బూజు పట్టిన మరుగుదొడ్లతో అధ్వాన్నంగా తయారైంది. కార్యాలయ పరిసరాల్లో దుర్వాసన వస్తుండడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదర్శంగా నిలవాల్సిన కలెక్టరేట్లో పారిశుద్ధ్యం లోపించడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.