ETV Bharat / state

నర్సాపూర్​ లంచం కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్​ - nagesh news

నర్సాపూర్ లంచం కేసు నిందితులను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీనితో నగేశ్​, అరుణా రెడ్డి, సత్తార్, వసీం, జీవన్ గౌడ్​లను అనిశా అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

Narsapur bribery accused remanded for 14 days
నర్సాపూర్​ లంచం కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్​
author img

By

Published : Sep 24, 2020, 8:36 PM IST

కోటి 12 లక్షల లంచం కేసులో నిందితులుగా ఉన్న అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్టీఓ అరుణా రెడ్డితో పాటు మరో ముగ్గురికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఐదుగురు నిందితుల కస్టడీ ముగియడం వల్ల అవినీతి నిరోధక శాఖాధికారులు వాళ్లను వైద్య పరీక్షల కోసం కోఠి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా... ఐదుగురికి నెగిటివ్​గానే ఫలితం వచ్చింది. అక్కడి నుంచి తీసుకెళ్లి న్యాయస్థానంలో హాజరుపర్చారు.

ఐదుగురు నిందితులకు వచ్చే నెల 8 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనితో నగేశ్​, అరుణా రెడ్డి, సత్తార్, వసీం, జీవన్ గౌడ్​లను అనిశా అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు. నగేశ్​, సత్తార్, జీవన్ గౌడ్ తరఫున న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అరుణా రెడ్డి తరఫు న్యాయవాది రేపు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

అదనపు కలెక్టర్ నగేశ్ లంచంగా తీసుకున్న 40లక్షల నగదు గురించి గానీ.... వసీం తీసుకున్న 3లక్షలు.. ఆర్డీఓ అరుణా రెడ్డి, తహసీల్దార్ సత్తార్ తీసుకున్న లక్ష రూపాయల లంచం గురించి అనిశా అధికారుల వద్ద ఒప్పుకోలేదు. లంచం గురించి ప్రశ్నించినప్పుడు నిందితులు తాము తీసుకోలేదనే సమాధానం ఇచ్చారు.

నగేశ్ బినామీలను ప్రశ్నించడంతో నగరంలో పలుచోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు అనిశా అధికారులు గుర్తించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ అప్పటి కలెక్టర్ రాసిన లేఖ ఆధారంగా.... ఆయనకు నోటీసులిచ్చే అంశాన్ని అనిశా అధికారులు పరిశీలిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.