రైతులకు రైతు వేదికలు దేవాలయాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పరిధిలోని పోడ్చన్పల్లి, కొత్తపల్లి, కొడపాక, మల్లంపేట, కుర్తివాడ క్లస్టర్లలో నిర్మించిన రైతు వేదికలను... ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రైతులను సంఘటితం చేయడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్... దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ వేదికల నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. ఏ పంట పండించుకోవాలి, ఏ ధరకు అమ్మాలి, ఏ విత్తనాలు వేసుకోవాలో చర్చించుకునేందుకు అనువైన ప్రదేశం... రైతు వేదికలన్నారు.
రైతులు చనిపోతే గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని... కానీ వారు వీధిపాలు కాకూడనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా ప్రవేశపెట్టారని ఎంపీ గుర్తు చేశారు. తెలంగాణను సశ్యశ్యామలం చేయాలనే సంకల్పంతో కాళేశ్వరం నిర్మించారని తెలిపారు.
ఎవరి స్థలాల్లో వారికి రెండు పడక గదుల ఇల్లు నిర్మిచే కార్యక్రమాన్ని మార్చి తర్వాత తలపెట్టనున్నట్టు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, జిల్లా వ్యవసాయాధికారి పరశురాం నాయక్, వ్యవసాయశాఖ అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కేటీఆర్ సొంత నిధులతో గంభీరావుపేట రైతు వేదిక నిర్మాణం