కరోనా నుంచి ప్రజలను కాపాడాలని ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, లక్ష్మి దంపతులు వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య నరసింహ సుదర్శనయాగం ఘనంగా నిర్వహించారు. త్రిదండి చినజీయర్‌స్వామి శిష్యులైన కరీంనగర్‌కు చెందిన వరప్రసాద్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా యాగ క్రతువు పూర్తి చేశారు. వారి స్వగ్రామమైన మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం పోచంపల్లి శివారులోని వ్యవసాయక్షేత్రంలో కార్యక్రమం చేపట్టారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పూజలు చేశారు. మెదక్‌కు చెందిన పురోహితులు వైద్య శ్రీనివాస్‌శర్మ వ్యాఖ్యానం భక్తులను ఆకట్టుకుంది. స్థానిక బ్రాహ్మణులు వేణుశర్మ, శ్రవణ్‌కుమార్ శర్మ, ప్రభాకర్, రవీందర్ బాబు హాజరయ్యారు. యాగం తిలకించేందుకు వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ రేకల హేమలత శేఖర్ గౌడ్, మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.