ప్రజల అభిమానం, భగవంతుని ఆశీస్సులు సీఎం కేసీఆర్‌పై మెండుగా ఉన్నాయని... ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి అన్నారు. కరోనా నుంచి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని తెలిపారు. ఏడుపాయల వన దుర్గా భవాని అమ్మవారిని దర్శంచుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీఎం కేసీఆర్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. నిజాంపేట మండలం చల్మెడలోని గాయత్రి మాత ఆలయంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ