ETV Bharat / state

పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన మంత్రి హరీష్​రావు - పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన మంత్రి హరీష్​రావు

మెదక్​ జిల్లా చేగుంటలో రెండు మండలాల రైతులకు మంత్రి హరీష్​రావు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. దుబ్బాకలో తెరాసను గెలిపించాలని ప్రజలను కోరారు.

minister harishrao distributed pass books in medak district
పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన మంత్రి హరీష్​రావు
author img

By

Published : Sep 24, 2020, 4:52 AM IST

మెదక్ జిల్లా చేగుంటలోని ఓ ఫంక్షన్ హాల్​లో జరిగిన చేగుంట, నార్సింగ్ మండలాలకు సంబంధించిన నూతన పట్టా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు మండలాల రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. భాజపా ప్రభుత్వం మార్కెట్ యార్డులు ఎత్తివేస్తామని అంటున్నారని.. మార్కెట్ యార్డులు ఎప్పట్లాగే ఉండాలని.. రైతుకు మద్దతు ధర వచ్చేలా ఉండాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రైతులకు కరెంటు మీటరు పెడతామని అంటోందని అన్నారు. దుబ్బాకలో తెరాసను గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణలో ఇచ్చే పింఛన్లలో కొద్ది భాగం ఇచ్చి కేంద్రం తామే పింఛన్లను ఇస్తున్నామని చెప్పుకుంటున్నారని మంత్రి హరీష్​ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:సకాలంలో నిధులు విడుదల చేయనందుకు డీపీవో‌ సస్పెన్షన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.