ETV Bharat / state

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి: హరీశ్​

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

minister harish rao review latest news
minister harish rao review latest news
author img

By

Published : Apr 28, 2020, 9:37 AM IST

ధాన్యం కొనుగోలు ప్రక్రియపై మెదక్​ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, సొసైటీ ఛైర్మన్లు, పంచాయతీరాజ్‌ ఇంజినీర్లతోపాటు రైసుమిల్లర్లతో మంత్రి హరీశ్​ రావు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతుందని... తాలు, మిల్లులో ధాన్యాన్ని దింపడంలో నెలకొంటున్న సమస్యతో కొన్నిచోట్ల మందకొడిగా సాగుతోందన్నారు.

కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడానికి రైసుమిల్లర్లు... కూలీల సంఖ్యను పెంచాలని, ధాన్యం తడవకుండా ఉండేందుకు సొసైటీ ఛైర్మన్లు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, ఈ విషయంలో తహసీల్దార్లు తమ పరిధిలో ఉన్న కేంద్రాలు తనిఖీ చేయాలని సూచించారు. ఈమేరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఆకస్మిక తనిఖీలు ఉంటాయ్‌...

గ్రామాల్లోని నర్సరీలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుందని మంత్రి హరీశ్​ రావు స్పష్టం చేశారు. ఆ సమయంలో మొక్కలు కనిపించకపోతే సంబంధిత సర్పంచి, పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. గతంలో ఎక్కడైనా నాటిన మొక్కలు ఎండిపోయి ఉంటే వాటి స్థానంలో వేరే మొక్కలను నాటాలన్నారు.

జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని, ఆయా ప్రాంతాల్లో ఇసుక, సిమెంట్‌ కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఉపాధి హమీ పథకం ద్వారా మంజూరైన సీసీ రహదారుల పనులను రాబోయే 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పనులకు సంబంధించి ఎవైనా సమస్యలు ఉంటే స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి పరిష్కరించుకోవాలన్నారు.

భూసేకరణ వేగవంతం చేయాలి...

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో కాళేశ్వరం కాలువల పనులపై సమీక్ష నిర్వహించారు. నిధుల కొరత లేనందున భూసేకరణను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమన్వయంతో ఆయా శాఖల అధికారులు ముందుకు సాగాలన్నారు.

కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, జడ్పీ ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి, పాలనాధికారి ధర్మారెడ్డి, అదనపు పాలనాధికారి నగేశ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ చంద్రాగౌడ్‌, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్‌, డీఎస్‌వో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.