ETV Bharat / state

ఏడేళ్లలో 70 ఏళ్ల అభివృద్ధి జరిగింది: హరీశ్​రావు

author img

By

Published : Apr 7, 2021, 8:55 PM IST

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ 103 కొత్త మండలాలను ఏర్పాటు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. ఏడేళ్లలో 70 ఏళ్ల అభివృద్ధి సీఎం కేసీఆర్ చేశారని కొనియాడారు.

Minister harish rao
మంత్రి హరీశ్​రావు

70 ఏళ్లుగా తెలంగాణలో ఇతర పార్టీలు చేయలేని అభివృద్ధి ఏడేళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని మంత్రి హరీశ్​రావు అన్నారు. మెదక్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన మాసాయిపేట మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ హరీశ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, పద్మాదేవేందర్​రెడ్డి, మదన్​రెడ్డి, మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు హేమలత, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్రంలో 541 మండలంగా మాసాయిపేట మండలం ఏర్పాటు చేసినట్లు వివరించారు. 103 కొత్త మండలాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​దేనని హరీశ్​ అన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, 24 గంటల విద్యుత్ అందించామని, నర్సరీలు, శ్మశాన వాటికలు, డంప్ యార్డుల నిర్మాణాలతో తెలంగాణ పల్లెలు పరిశుభ్ర గ్రామాలుగా ఏర్పడ్డాయన్నారు. 70 ఏళ్లుగా చేయని ప్రగతి ఏడేళ్లలో చేసి చూపించామని మంత్రి హరీశ్​ అన్నారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూకి ఆస్కారం లేదు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.