ETV Bharat / state

'తెరాస అధికారంలోకి వచ్చాక గుణాత్మకమైన మార్పు కనిపిస్తోంది' - Minister Harish Rao inaugurated the power substation at Shankarampet

సమైక్య పాలకుల మాటలను తల్లకిందులు చేస్తూ నేడు దేశంలోనే అత్యధిక విద్యుత్​ వినియోగిస్తున్న రాష్ట్రంగా నిలిచామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. మెదక్​ జిల్లా శంకరంపేట మండల కేంద్రంలో రూ.12.39 కోట్లతో ఏర్పాటు చేసిన 132/33 కేవీ సబ్ స్టేషన్​ను ఆయన ప్రారంభించారు.

Minister Harish Rao inaugurated the power substation at Shankarampet
'తెరాస అధికారంలోకి వచ్చాక గుణాత్మకమైన మార్పు కనిపిస్తోంది'
author img

By

Published : Feb 24, 2021, 10:36 PM IST

Updated : Feb 24, 2021, 10:41 PM IST

తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విద్యుత్​ రంగంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ ​రావు అన్నారు. మెదక్​ జిల్లా శంకరంపేట మండల కేంద్రంలో రూ.12.39 కోట్లతో ఏర్పాటు చేసిన 132/33 కేవీ సబ్ స్టేషన్​ను ఆయన ప్రారంభించారు. అనంతరం మెదక్ పట్టణంలో రూ.2.11కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ ​స్టేషన్​కు మంత్రి శంకుస్థాపన చేశారు.

తెలంగాణ వస్తే అంతా చీకటి మయం అవుతుందన్న సమైక్య పాలకుల మాటలను తల్లకిందులు చేస్తూ నేడు దేశంలోనే అత్యధిక విద్యుత్​ను వినియోగిస్తున్న రాష్ట్రంగా నిలిచామని హరీశ్​​ రావు అన్నారు. 70 ఏళ్ల పాలనలో పొట్టకూటికోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన మన సోదరులు ఈ ఏడేళ్ల ప్రభుత్వ పాలనలో అభివృద్ధిని చూసి గ్రామాలకు తరలి వస్తున్నారని తెలిపారు.

శంకరంపేట మండల ప్రజలకు త్వరలోనే కాళేశ్వరం నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని ఖాజాపూర్​ గ్రామంలో అర్హులైన గిరిజనులకు గిరివికాస్​ పథకం కింద రూ.6.73 లక్షల విలువ చేసే సబ్ మేర్సిబుల్ పంపు సెట్లను అందించారు. 5 ఎకరాలపైబడి భూమి ఉండి బోర్లు లేని వారు కొత్తగా బోర్లకోసం దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్​ శాసన సభ్యురాలు పద్మాదేవెందర్​ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ యస్.హరీశ్​ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: లక్ష్మీనరసింహ స్వామి ఎత్తిపోతల పనుల ప్రీక్లోజర్​కు అనుమతి

Last Updated : Feb 24, 2021, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.