ETV Bharat / state

'లక్ష్యాలు పెట్టుకోండి... ప్రణాళికలు సిద్ధం చేసుకోండి'

author img

By

Published : Dec 31, 2020, 3:15 PM IST

2020లో కరోనా మహమ్మారితో చాలా ఇబ్బందులు పడ్డామనీ... వాటి నుంచి తేరుకుని 2021కు స్వాగతం పలకాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

minister harish rao convey new year wishes to every one in state
'లక్ష్యాలు పెట్టుకోండి... ప్రణాళికలు సిద్ధం చేసుకోండి'

రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు.

కేసీఆర్ నాయకత్వంలో 2020లో రాష్ట్రం అన్ని రంగాల్లో.. పురోగతి సాధించిందని గుర్తుచేశారు. 2021వ సంవత్సంలో కూడా అదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాష్ట్రాన్నీ అభివృద్ధి చేస్తామని తెలిపారు. కరోనా మహమ్మారితో చాలా ఇబ్బందులు పడ్డామని... ఆ సమస్యల నుంచి తేరుకొని 2021లో కుటుంబాల్లో సుఖ, శాంతులు విలసిల్లాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, యువత నూతన లక్ష్యాలు పెట్టుకోవాలని... ఆ లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. 2020కి వీడ్కోలు పలుకుతూ... కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న అందరికి శుభం కలగాలని కోరుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఇదీ చూడండి: జనవరి 1 నుంచి స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.