మెదక్ జిల్లా కేంద్రంలో మెదక్ ఆర్టీసీ డిపో గ్యారేజ్ ఎదుట ఉద్యోగులు, కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.
ఇవీ చూడండి: ప్రభుత్వ శాఖల సరకు రవాణా.. ఆర్టీసీలోనే..!