మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు కళాశాల గేటు ముందు ధర్నా చేశారు. తమను ప్రిన్సిపల్ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే అతన్ని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న రీజనల్ కోఆర్డినేటర్ బాలస్వామి విచారణ జరిపి ప్రిన్సిపల్ను తొలగించారు.
ఇదీ చదవండి : స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ గురి