ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్తోనే అన్నీ పనులు జరిగిపోతున్నాయి. ప్రజలు బయటికి వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మెదక్ ఎస్పీ చందన దీప్తి సూచించారు. ప్రజలు సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరితమైన ఆశలకు, మోసాలకు గురికావొద్దన్నారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు సామాన్య పేద ప్రజలను టార్గెట్ చేస్తూ ఆన్‌లైన్‌లో ఆహారం, ఇతర ఖరీదైన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయం, ఆఫర్ల పేరిట దోచేస్తున్నారని తెలిపారు.
ఆన్‌లైన్‌లో తక్కువ ధరలకే వస్తువులంటూ ఆశచూపి సైబర్ నేరగాళ్లు మరో కొత్తరకం మోసాలకు, నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలు ఆన్‌లైన్‌లో మోసగాళ్లు చూపే ఆశలకు మోసపోకుండా.. తమ కష్టార్జితాన్ని కాపాడుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతీ యువకులు చెడుదారి పట్టకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులకు ఎస్పీ చందన దీప్తి సూచించారు.
ఇవీ చూడండి: చోరీ కేసులను ఛేదించిన బోధన్ పోలీసులు