లాక్డౌన్ కారణంగా మెదక్ జిల్లాలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకూ ప్రజలెవరూ బయటకు రాకూడదని, అత్యవసర సమయాల్లో వచ్చినా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.
ప్రతి దుకాణం వద్ద భౌతిక దూరం పాటిస్తూనే సరుకులు కొనుక్కోవాలని లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఇప్పటి వరకు జిల్లాలో 2198 వాహనాలు సీజ్ చేసినట్లు, అందులో 1985 ఆటోలు, 155 ఆటోలు, 35 కార్లు, 24 ఇతర వాహనాలు ఉన్నాయని వివరించారు. లాక్డౌన్ నుంచి కొన్ని అంశాల సడలింపు అలుసుగా తీసుకొని విచ్చలవిడిగా రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి