మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లిలోని నారాయణరెడ్డి కాలనీకి చెందిన గ్యారంగుల సాలమ్మ అనే మహిళ ఆగష్టు 17 నుంచి కనిపించకుండా పోయింది. అంతకు ఒకరోజు ముందు హవేలి ఘనపూర్ మండలం తొగిటకు చెందన మాచబోయిన మహేష్ మిత్రుడి వివాహానికి హాజరయ్యేందుకు పాపన్నపేట మండలం మల్లంపేటకు వచ్చాడు. అక్కడ ఒక స్నేహితుడి ద్వారా సాలమ్మ మొబైల్ నెంబర్ సంపాదించాడు. 17న మహేష్ సాలమ్మకు ఫోన్ చేశాడు.
మెదక్ మండలం మంబోజిపల్లిలో ఉన్నానని చెప్పగా.. అక్కడికి వెళ్లి సాలమ్మను కలిశాడు. అనంతరం ఇద్దరు నాగ్సాన్పల్లి అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఇద్దరు శారీరకంగా కలిశారు. మహేష్ వెంటనే మరోసారి కలుద్దామని సాలమ్మను ఒత్తిడి చేశాడు. అందుకు సాలమ్మ డబ్బులు డిమాండ్ చేసింది. ఈ క్రమంలోని ఇద్దరికి పెనుగులాట జరిగింది. కోపంతో మహేష్ సాలమ్మపై బండరాయితో దాడి చేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న రూ.300 తీసుకొని కొల్చారం మండలం పోతంశెట్‌పల్లి మీదుగా స్వగ్రామానికి చేరుకున్నాడు.
అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని.. విచారణ చేపట్టారు. మెదక్ గ్రామీణ సీఐ పాలవెల్లి, పాపన్నపేట ఎస్సై ఆంజనేయులు కలిసి జరిపిన విచారణలో మృతురాలి చరవాణికి వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడి వివరాలు కనుక్కున్నారు. మెదక్ మండలం మంబోజిపల్లిలో సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించి మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకొన్నాడు. నిందితుడిని అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు.
ఇదీ చూడండి : విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ