ETV Bharat / state

రూ.28.03 కోట్లతో మిగులుతో మెదక్​ పురపాలిక బడ్జెట్‌ - మెదక్​ మున్సిపల్​ బడ్జెట్​ 2021-22

జిల్లా కేంద్రం మెదక్‌ పురపాలిక 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రూ.28,03,54,000 తో పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. బుధవారం పురపాలిక కార్యాలయంలో బడ్జెట్‌ సమావేశం జరిగింది.

Medak Budget, medak, telangana, 2021-22 medak
Medak Municipal Budget
author img

By

Published : Apr 1, 2021, 10:57 AM IST

మెదక్ మున్సిపాలిటీ 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్​కు పాలకవర్గం సమవేశంలో సభ్యులు ఆమోదించారు. రూ.28,03,54,000తో బడ్జెట్​ను ప్రతిపాదించారు. ఖర్చులన్నీ పోను మిగులు రూ.10 లక్షలు ఉంటుందని అధ్యక్షుడు చంద్రపాల్‌ తెలిపారు. గ్రాంట్ల రూపంలో రూ.17.31 కోట్లు వస్తాయన్నాయని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత పట్టణానికి ప్రజల రాకపోకలు అధికమయ్యాయని, ప్రజా ప్రతినిధుల సహకారంతో ఆ మేరకు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. విలీన గ్రామాలైన ఔరంగాబాద్‌, అవుసులపల్లి, పిల్లికొట్టాల్‌ గ్రామాల అభివృద్ధికి సాధారణ నిధుల్లో మూడోవంతు కేటాయించామన్నారు. పిల్లికొట్టాల్‌ వద్ద నూతన దుకాణ సముదాయం, జంతు వధశాల నిర్మాణానికి స్థల సేకరణ పూర్తి అయిందని, త్వరలో టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. 9వ వార్డులో ఉద్యానం ఆక్రమణలకు గురవుతోందని కౌన్సిలర్‌ మేడి కల్యాణి సమావేశం దృష్టికి తీసుకురాగా.. ఆక్రమణలను అడ్డుకుంటామని, మరమ్మతులు చేయించి వినియోగంలోకి తెస్తామని తెలిపారు.

మెదక్​ పురపాలికలో బడ్జెట్‌ సమావేశం
మెదక్​ పురపాలికలో బడ్జెట్‌ సమావేశం

ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్‌ ప్రకటనపై సభ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపింది. సమావేశంలో ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌ గౌడ్‌, కమిషనర్‌ శ్రీహరి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ ప్రజలు మాస్కులు ధరించకుంటే మొదటిసారి రూ.200 జరిమానా విధిస్తామన్నారు. వ్యాపారులు దుకాణాల వద్ద కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ ఛైర్మన్‌ హెచ్చరించారు. అన్ని వార్డుల్లో ఈ నెల 2 నుంచి సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయనున్నట్లు తెలిపారు.

మెదక్‌ పురపాలికలో పారిశుద్ధ్య పర్యవేక్షకురాలు వనిత కింది స్థాయి ఉద్యోగులతో దురుసుగా మాట్లాడుతున్నారని.. సకాలంలో స్పందించడం లేదని.. ఆమెను సరెండర్‌ చేయాలని 19 మంది కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. ఆమె తీరు మార్చుకోమని చెబుతానని ఛైర్మన్‌ వారికి నచ్చజెప్పారు. సమావేశం అనంతరం వనిత మాట్లాడుతూ.. కౌన్సిలర్ల వ్యక్తిగత పనులు చేయించనందుకే కొందరు కావాలని ఇబ్బంది పెడుతున్నారంటూ బోరున విలపించారు.

అంచనా ఆదాయాలు (రూ.లో)అంచనా వేసిన కొన్ని ముఖ్య వ్యయాలు (రూ.లో)
ఆస్తి పన్ను 5.07 కోట్లువేతనాలు 4.12 కోట్లు
అసైన్డ్‌ ఆదాయం 10 లక్షలుపారిశుద్ధ్యం నిర్వహణ 1.44 కోట్లు
పన్నేతర ఆదాయంవిద్యుత్తు 60.75 లక్షలు
అద్దెలు 94.85 లక్షలుహరితహారం 1.06 కోట్లు
పారిశుద్ధ్య విభాగం రసీదులు 14 లక్షలుఇంజినీరింగ్‌ 1.80 కోట్లు
పట్టణ ప్రణాళిక విభాగం 2.91 కోట్లుసాధారణ పరిపాలన 61.30 లక్షలు
ఇంజినీరింగ్‌ 1.36 కోట్లుపట్టణ ప్రణాళిక నిర్వహణ 24 లక్షలు
డిపాజిట్లు, రుణాలు 20 లక్షలువసతులు 16 లక్షలు
-గ్రీనరీ 55.10 లక్షలు

ఇదీ చూడండి: ఉమ్మడి మెదక్​ జిల్లాకు మూడు జాతీయ పురస్కారాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.