ETV Bharat / state

గిరిజన వేషధారణలో ఆడిపాడిన ఎమ్మెల్యే

author img

By

Published : Feb 15, 2021, 1:10 PM IST

సేవాలాల్ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. గిరిజన వేషధారణలో నృత్యాలు చేశారు. ఈ ఉత్సవాలను మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్, రామాయంపేట తండాల్లో ఘనంగా నిర్వహించారు.

medak mla padma devender reddy at sevalal birthday celebrations in ramayampeta
గిరిజన వేషధారణలో ఆడిపాడిన ఎమ్మెల్యే

సేవాలాల్ మహారాజ్ గిరిజనులకు ఒక మంచి మార్గాన్ని చూపించారని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్, రామాయంపేట తండాల్లో సేవాలాల్ 282 జయంతి ఉత్సవాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. గిరిజన వేషధారణలో ఆడిపాడారు. జగదాంబదేవికి, సేవాలాల్​కు నిర్వహించిన బోగు బండార్, బొట్టూ బోనం కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు. పేదలకు ఇల్లు కట్టిస్తామని.. స్థలం ఉంటే ఆ స్థలంలోనే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని తెలిపారు. కార్పొరేషన్ల ద్వారా గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామన్నారు.

గిరిజన వేషధారణలో ఆడిపాడిన ఎమ్మెల్యే

ఇదీ చూడండి: 'సేవాలాల్ మహరాజ్ హిందువులందరికీ ఆదర్శం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.