మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్లను పరిశీలించారు. వ్యాపారస్తులు, ప్రజలు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని సూచించారు. ఈ సందర్బంగా మాస్క్ లేకుండా బయట తిరుగుతున్న వ్యక్తులకు 500 రూపాయల జరిమానాను విధించారు. మాస్క్ లేకుండా ఎవరు కనిపించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి సన్నాహాలు