ETV Bharat / state

మెదక్​లో ఘనంగా జెండా పండుగ - కలెక్టరేట్లో

మెదక్ జిల్లాలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్​లో జడ్పీ ఛైర్​ పర్సన్​ హేమలత జాతీయ జెండాను ఆవిష్కరించారు.

మెదక్​లో జెండా పండుగకు చిన్నారుల సందడి
author img

By

Published : Aug 15, 2019, 9:11 PM IST

మెదక్​ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జడ్పీ ఛైర్​పర్సన్ హేమలత హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను జడ్పీ ఛైర్​పర్సన్ సన్మానించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. రాఖీ పౌర్ణమి ఇదే రోజు కావడం వల్ల చిన్నారులు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈ వేడుకల్లో కలెక్టర్ ధర్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా ఎస్పీ చందన దీప్తి, జాయింట్ కలెక్టర్ నగేష్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మెదక్​లో ఘనంగా జెండా పండుగ

ఇదీ చూడండి : పీపుల్స్​ప్లాజాలో ప్రారంభమైన జాతీయ ఉద్యాన ప్రదర్శన

Intro:TG_SRD_41_15_AUGEST15_AV_TS10115..
రిపోర్టర్..శేఖర్
మెదక్
మెదక్ కలెక్టరేట్ లో.73. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జడ్ పి చైర్ పర్సన్ హేమలత జాతీయ జెండాను ఆవిష్కరించారు..
అనంతరం పోలీసుల నుంచి జెడ్ పి చైర్ పర్సన్ హేమలత , జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి , జిల్లా ఎస్పీ చందన దీప్తి, గౌరవ వందనం స్వీకరించారు ....
పథక ఆవిష్కరణ అనంతరం జెడ్ పి చైర్ పర్సన్ హేమలత ప్రభుత్వ పథకాలపై సందేశాన్ని చదివి వినిపించారు.... అనంతరం స్వాతంత్ర సమరయోధుల అమరవీరుల కుటుంబాలను సన్మానించిన జెడ్పి చైర్ పర్సన్ హేమలత..
వివిధ పాఠశాలల నుంచి వచ్చిన చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ...
అంగన్ వాడి పిల్లలు జాతీయ నాయకుల వేషధారణతో అందర్నీ ఆకట్టుకున్నారు...
రాఖీ పౌర్ణమి ఇదే రోజు కావడంతో చిన్నారులు కలెక్టర్, ఎమ్మెల్యే ,ఎస్పీ, జెడ్ పి చైర్ పర్సన్ లకు, రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు...
సాంస్కృతిక కార్యక్రమాల్లో అలరించిన చిన్నారులకు బహుమతులు అందజేశారు .అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు...
ఇంటింటా ఇన్నోవేటివ్ ప్రోగ్రాంలో భాగంగా పలు విద్యార్థులు అధికారులు లు నిత్య జీవితంలో ప్రజలకు ఉపయోగపడే ప్రయోగ నమూనాలు రూపొందించి ప్రదర్శించారు... జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించి వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది...
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ధర్మారెడ్డి ప్రారంభించారు..
పలువురు రక్తదానం చేశారు. వేడుకల్లో కలెక్టర్ ధర్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా ఎస్పీ చందన దీప్తి, జాయింట్ కలెక్టర్ నాగేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు...

Body:విజువల్స్

Conclusion:ఎన్. శేఖర్ మెదక్9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.