ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి - స్థితి

వివాహిత అనుమానాస్పద మృతి ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలం ఔరంగాబాద్ స్కూల్ తండాలో చోటుచేసుకుంది.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
author img

By

Published : Aug 18, 2019, 8:38 PM IST

మెదక్ జిల్లాలో ఓ వివాహిత కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేది. ఆదివారం ఉదయం అవుసులపల్లి శివారులో బోయిన్​పల్లి విష్ణువర్ధన్​కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఆమె మృతదేహం ఓ చెట్టు కింద పడి ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐలు వెంకట్, రాజశేఖర్, ఎస్ఐ లింబాద్రి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి బట్టలు లేకుండా నగ్నంగా ఉండడంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమెను చీరతో ఉరి వేసినట్లు కూడా గుర్తులు ఉన్నట్లు తెలిపారు. సంఘటన స్థలంలో చెప్పులు, మద్యం బాటిళ్లు, ఇతర వస్తువులు లభ్యమయ్యాయని డీఎస్పీ పేర్కొన్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మెదక్ జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

ఇదీ చూడండి : భాజపా బహిరంగ సభకు హాజరైన జె.పి. నడ్డా

TG_SRD_41_18_CRIME_SCRIPCT_TS10115. రిపోర్టర్.శేఖర్. మెదక్.. మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలం ఔరంగాబాద్ శివారులో అనుమానాస్పదస్థితిలో వివాహిత దారుణంగా హత్యకు గురైన సంఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలం ఔరంగాబాద్ స్కూల్ తండాలో చోటుచేసుకుంది... డిఎస్పి కృష్ణమూర్తి వివరాల ప్రకారం కేతావత్ విజయ(25) కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేది ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం అవుసుల పల్లి శివారులో బోయిన్ పల్లి విష్ణువర్ధన్ కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో లో విజయ మృతదేహం ఓ చెట్టు కింద పడి ఉంది. దానిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు... దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న మెదక్ డిఎస్పి కృష్ణమూర్తి , సీఐలు వెంకట్ ,రాజశేఖర్,,. ఎస్ ఐ లింబాద్రి మృతదేహాన్ని పరిశీలించారు ..మృతదేహంపై ఎలాంటి బట్టలు లేకుండా నగ్నంగా ఉండడంతో విజయ అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆమెను చీరతో ఉరి వేసినట్లు తెలిపారు ఈ.సందర్భంగా సంఘటనాస్థలానికి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ,ను రప్పించి చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు, మృతురాలు భర్త కేతావత్ దేవుల రోధించడం అక్కడున్న వారిని కలచివేసింది .. సంఘటన స్థలంలో చెప్పులు ,మద్యం బాటిళ్లు, ఇతర వస్తువులు లభ్యమయ్యాయని డి ఎస్ పి కృష్ణమూర్తి తెలిపారు.. మృతురాలు విజయకు ఇద్దరు కూతుర్లు ,ఒక కుమారుడు, ఉన్నారు .. ఎలాంటి గొడవలు జరగకుండా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు .. వివరాలు సేకరించి త్వరలో నిందితులను పట్టుకుంటామని డిఎస్పి కృష్ణమూర్తి తెలిపారు తెలిపారు.. బైట్..కృష్ణ మూర్తి. మెదక్ డి.ఎస్.పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.