మెదక్ జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణాలు చాలా వరకు పూర్తి కాలేదని ఈ విషయంలో సంబంధిత అధికారులు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించి వాటిని పూర్తి చేయించాల్సిందిగా సూచించారు. ఆయా గ్రామాల్లో రైతులు తాము పండించే పంటలు, నియంత్రిత సాగు, వ్యవసాయ సంబంధిత సమావేశాలను నిర్వహించుకునేందుకు వీలుగా వీటి నిర్మాణం చేపట్టాలన్నారు.
ఇదీ చూడండి : ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా