ETV Bharat / state

హరితహారం గోడ పత్రిక ఆవిష్కరించిన కలెక్టర్​ ధర్మారెడ్డి - హరితహారం

ఆరో విడత హరితహారం ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో హరితహారం గోడ పత్రికను మెదక్​ జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి ఆవిష్కరించారు. అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి.. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని అధికారులకు సూచించారు.

Medak Collector Release Haritha Haram Wall Poster
హరితహారం గోడ పత్రిక ఆవిష్కరించిన కలెక్టర్​ ధర్మారెడ్డి
author img

By

Published : Jun 22, 2020, 7:57 PM IST

మెదక్​ జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో ఆరో విడత హరితహారం గోడ పత్రికను కలెక్టర్​ ధర్మారెడ్డి ఆయన ఛాంబర్​లో ఆవిష్కరించారు. ఈ విడతలో అనుకున్న లక్ష్యం కంటే.. ఎక్కువ మొక్కలు నాటి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని.. ఆ దిశగా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తోడ్పాటునివ్వాలని కోరారు.

మొక్కలు నాటడమే కాకుండా.. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనపైనే ఉందన్న విషయం మరువద్దని అన్నారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటేలా బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్​ నగేష్, జిల్లా పరిషత్​ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్​డీవో పీడీ శ్రీనివాస్​, జిల్లా అటవీ శాఖ అధికారిణి పద్మజారాణి, జిల్లా పంచాయతీరాజ్​ అధికారి హనోక్​, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కరోనాతో ఉపాధి కోల్పోయిన 20 లక్షల మంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.